సహకరించండి.. రివార్డ్ ఇస్తా...
ABN , First Publish Date - 2020-12-15T10:28:32+05:30 IST
బాలీవుడ్ నటి జూహీ చావ్లా ట్విట్టర్ వేదికగా చేసిన ఓ రిక్వెస్ట్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తనకు సాయం చేస్తే మంచి రివార్డు కూడా ఇస్తానంటున్నారు...

బాలీవుడ్ నటి జూహీ చావ్లా ట్విట్టర్ వేదికగా చేసిన ఓ రిక్వెస్ట్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తనకు సాయం చేస్తే మంచి రివార్డు కూడా ఇస్తానంటున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఆదివారం ఆమె ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం డైమండ్ ఇయర్ రింగ్ పొగొట్టుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘‘ఆదివారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ముంబై విమానాశ్రయం టర్మినల్ 2లోని ఎనిమిదో నంబర్ గేట్‌వైపు వెళ్లాను. సెక్యూరిటీ చెక్ ఇమ్మిగ్రేషన్ కూడా పూర్తయ్యింది. అదే సమయంలో నా డైమండ్ ఇయర్ రింగ్ ఒకటి ఎక్కడో జారి పడిపోయింది. గత పదిహేనేళ్లుగా ప్రతి రోజూ నేను ఈ చెవి దుద్దులను ధరిస్తూ ఉన్నాను. దాన్ని వెతకడంలో నాకు ఎవరైనా సాయం చేేస్త.. ఎంతో ఆనందిస్తా. ఆ చెవి రింగు ఎవరికైనా దొరికితే పోలీసులకు అందించండి. దానికి మంచి రివార్డు కూడా ఇస్తాను’’ అని దాని జత చెవి రింగ్ ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
Read more