జీవిత డిశ్చార్జ్‌.. నిలకడగా రాజశేఖర్‌ ఆరోగ్యం

ABN , First Publish Date - 2020-10-25T00:09:48+05:30 IST

కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతున్న నటుడు, హీరో రాజశేఖర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు గురువారం అధికారికంగా హెల్త్ బులిటెన్‌ను

జీవిత డిశ్చార్జ్‌.. నిలకడగా రాజశేఖర్‌ ఆరోగ్యం

కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతున్న నటుడు, హీరో రాజశేఖర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు గురువారం అధికారికంగా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు రాజశేఖర్‌ ఫ్యామిలీ మొత్తానికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే రాజశేఖర్‌ ఇద్దరు కుమార్తెలు కరోనా నుంచి త్వరగానే కోలుకున్నారు. జీవిత, రాజశేఖర్‌ మాత్రం ఇంకా కరోనాతో ఫైట్‌ చేస్తూనే ఉన్నారు. రాజశేఖర్‌, జీవితలు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మెగాస్టార్‌ చిరంజీవి, నటుడు మోహన్‌బాబు ఆకాంక్షిస్తూ.. ఆయన కుటుంబానికి ధైర్యం చెబుతూ ట్వీట్స్ చేశారు. తాజాగా జీవిత, రాజశేఖర్‌లకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ.. సిటీ న్యూరో సెంటర్ అధికారికంగా మరో హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.


తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో.. రాజశేఖర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్సకు ఆయన చక్కగానే స్పందిస్తున్నారని, త్వరలోనే కోలుకుంటారని తెలిపారు. ఇక రాజశేఖర్‌ శ్రీమతి జీవిత విషయానికి వస్తే.. కరోనా నుంచి ఆమె పూర్తిగా కోలుకున్నారని, కరోనా నెగిటివ్‌ రావడంతో.. ఆమెను ఈరోజు డిశ్చార్జ్‌ చేసినట్లుగా వెల్లడించారు.


''డాక్టర్‌ కృష్ణగారి నాయకత్వంలో సిటీ న్యూరో సెంటర్ వైద్య బృందం నాన్నగారిని చక్కగా చూసుకుంటున్నారని, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని, ట్రీట్‌మెంట్‌కు స్పందిస్తున్నారు" అని ట్వీట్‌ చేసింది రాజశేఖర్‌ కుమార్తె శివాని రాజశేఖర్‌. నాన్నకోసం ప్రార్థనలు చేస్తూ.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ఆమె తన ట్వీట్‌లో పేర్కొంది.

Updated Date - 2020-10-25T00:09:48+05:30 IST

Read more