షకీల సినిమాకు సెన్సార్ నుండి క్లీన్ ‘యు’

ABN , First Publish Date - 2020-06-10T00:17:57+05:30 IST

షకీల అంటే అశ్లీలతతో కూడిన సినిమాలే చేస్తుంది.. కుటుంబ కథా చిత్రాలు చేయదనే విమర్శలున్నాయి. అన్ని రకాల సినిమాలు చేయగలనని నిరూపించుకోవడం

షకీల సినిమాకు సెన్సార్ నుండి క్లీన్ ‘యు’

షకీల అంటే అశ్లీలతతో కూడిన సినిమాలే చేస్తుంది.. కుటుంబ కథా చిత్రాలు చేయదనే విమర్శలున్నాయి. అన్ని రకాల సినిమాలు చేయగలనని నిరూపించుకోవడం కోసం రూపొందిస్తున్న సినిమా ‘షకీల రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం’. విక్రాంత్‌, పల్లవి ఘోష్‌ జంటగా నటిస్తున్నారు. సి.హెచ్‌. వెంకట్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కాన్సెప్ట్, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ సాయిరామ్ దాసరి. నవ్యమైన కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ మూవీ ఇప్పటికే చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని సెన్సార్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇంతలో లాక్‌డౌన్ రావడంతో సెన్సార్ పూర్తి కాలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ నుంచి ఈ సినిమాకు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ వచ్చింది. 


అటు షకీల సినీ ప్రస్థానంలో కానీ ఇటు సాయిరామ్ దాసరి సినీ జీవితంలో ఇదే తొలి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ సినిమా.. కేవలం ‘జగన్ అన్న’ అనే ఒక పదం మ్యూట్ తప్ప ఎటువంటి కట్లు, మ్యూట్లు లేవు అని చిత్రయూనిట్ తెలిపింది. అలాగే తన ప్రతి సినిమా విడుదలకు ముందు ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లోకి ఎక్కే సాయిరామ్ దాసరి.. తొలిసారి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ సినిమా తీయడంతో ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఫిల్మ్ నగర్ అయ్యారు. రెండు గంటల రెండు నిమిషాల వ్యవధిలో 9 పాటలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా దర్శకుడు తెలిపారు. ఇది సంపూర్ణంగా కుటుంబ కథా చిత్రమని, ఓ.టి.టి.లో విడుదల చేయాలా లేక సినిమా హాల్‌లో విడుదల చేయాలా అనే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే పూర్తి వివరాలు తెలుపుతామని దర్శకుడు సాయిరామ్ దాసరి చెప్పారు.



Updated Date - 2020-06-10T00:17:57+05:30 IST