గుమ్మడికాయ కొట్టేశారు!

ABN , First Publish Date - 2020-12-18T05:07:09+05:30 IST

ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్‌ జంటగా నటిస్తున్న ‘క్లాప్‌’ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకొంటున్న ఈ ఎంటర్‌టైనర్‌కు పృథ్వి ఆదిత్య దర్శకుడు. లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం షూటింగ్‌ను ఇటీవల తిరిగి ప్రారంభించారు....

గుమ్మడికాయ కొట్టేశారు!

ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్‌ జంటగా నటిస్తున్న ‘క్లాప్‌’ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకొంటున్న ఈ ఎంటర్‌టైనర్‌కు పృథ్వి ఆదిత్య దర్శకుడు. లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం షూటింగ్‌ను ఇటీవల తిరిగి ప్రారంభించారు. 65 వర్కింగ్‌ డేస్‌లో షూటింగ్‌ పూర్తయినట్లు నిర్మాతలు రామాంజనేయులు జవ్వాజి, ఎం.రాజశేఖరరెడ్డి చెప్పారు. షూటింగ్‌ చివరి రోజు చివరి సీన్‌ పూర్తి కాగానే హీరో ఆది పినిశెట్టి దర్శకుడు పృథ్వీని కౌగలించుకొని, ఎమోషనల్‌ అయ్యారు. తాము ఊహించిన దానికంటే సన్నివేశాలు బాగా వచ్చాయనీ, చెన్నై స్టేడియంలో చిత్రీకరించిన సన్నివేశాలు హైలైట్‌ అవుతాయనీ దర్శకుడు చెప్పారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాతలు చెప్పారు.

Updated Date - 2020-12-18T05:07:09+05:30 IST