సినీ పాత్రికేయుడు ‘పరాశక్తి’ మాలి మృతి

ABN , First Publish Date - 2020-02-08T15:25:23+05:30 IST

సీనియర్‌ తమిళ సినీ పాత్రికేయుడు ‘పరాశక్తి’ మాలి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో

సినీ పాత్రికేయుడు ‘పరాశక్తి’ మాలి మృతి

సీనియర్‌ తమిళ సినీ పాత్రికేయుడు ‘పరాశక్తి’ మాలి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం చెన్నై పోరూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం ఉదయం 10.45 గంటలకు మృతి చెందారు. మాలి తమ్ముడు ‘మక్కల్‌ కురల్‌’ రాంజీ కూడా పాత్రికేయుడే. మాలి అంత్యక్రియలు శనివారం ఉదయం నావలూరులో జరుగుతుందని కుటుంబీకులు తెలిపారు. మాలి మృతి పట్ల చెన్నై పాత్రికేయుల సంఘం తీవ్ర సంతాపం ప్రకటించింది.

Updated Date - 2020-02-08T15:25:23+05:30 IST