బిగ్‌బీ కోలుకోవాల‌ని సినీ ప్ర‌ముఖుల ట్వీట్స్‌

ABN , First Publish Date - 2020-07-12T14:53:04+05:30 IST

ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ స‌హా టాలీవుడ్‌, కోలీవుడ్ ఇత‌ర సినీ ప‌రిశ్ర‌మ‌ల సినీ ప్ర‌ముఖులు బిగ్‌బీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటూ ట్వీట్స్ వేశారు.

బిగ్‌బీ కోలుకోవాల‌ని సినీ ప్ర‌ముఖుల ట్వీట్స్‌

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆయ‌న ముంబైలోని నానావ‌తి హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వయంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ స‌హా టాలీవుడ్‌, కోలీవుడ్ ఇత‌ర సినీ ప‌రిశ్ర‌మ‌ల సినీ  ప్ర‌ముఖులు బిగ్‌బీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటూ ట్వీట్స్ వేశారు. మ‌న తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ విష‌యానికి వ‌స్తే చిరంజీవి, నాగార్జున‌, మ‌హేశ్‌, ర‌వితేజ‌, సందీప్ కిష‌న్‌, గుణ‌శేఖ‌ర్‌, రాశీఖ‌న్నా, తాప్సీ, ప్రియ‌మ‌ణి, శ‌ర‌త్ కుమార్‌, రాధిక‌, నిత్యామీన‌న్ త‌దిత‌రులు  అమితాబ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నామ‌ని తెలిపారు. మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన అగ్ర క‌థానాయ‌కులు మోహ‌న్‌లాల్‌, మ‌మ్ముట్టి కూడా అమితాబ్ ఆరోగ్యం కుదుట‌ప‌డాలంటూ ట్వీట్స్ చేశారు.  

Updated Date - 2020-07-12T14:53:04+05:30 IST