ప్రేక్షకాభిమానులకు సినీ సెలబ్రిటీల దసరా శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2020-10-25T15:04:38+05:30 IST
శుభదినాన ప్రేక్షకాభిమానులందరూ సుఖసంతోషాలతో ఉండాలని మన సెలబ్రిటీలు ఆశిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలను అందజేశారు.

విజయదశమి... విజయానికి సూచిక, చెడుపై మంచి విజయం సాధించినరోజు... ఇందుకు మన పురాణాలు, ఇతిహాసాలు పలు ఉదాహరణలు వివరిస్తున్నాయి. ఇలాంటి శుభదినాన ప్రేక్షకాభిమానులందరూ సుఖసంతోషాలతో ఉండాలని మన సెలబ్రిటీలు ఆశిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలను అందజేశారు.
అమితాబ్: దుర్గమ్మ, సరస్వతీ తల్లి స్నేహం, ఆశీర్వాదం ఎప్పుడూ మనపై ఉండాలని కోరుకుంటున్నాను
అక్కినేని నాగార్జున: నా స్నేహితులందరికీ దసరా శుభాకాంక్షలు
మహేశ్: అందరికీ దసరా శుభాకాంక్షలు
ప్రేక్షకులకు మహేశ్ దసరా శుభాకాంక్షలను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెలియజేయడం విశేషం.
అనుష్క: అందరికీ దసరా శుభాకాంక్షలు.. అందరూ క్షేమంగా పండుగను జరుపుకోండి.
రాశీఖన్నా: మన అంతర్గతంలో శత్రువులు లేకపోతే నిన్ను బయట శత్రువులు బాధపెట్టలేరు. ఈ విజయదశమి నీలోని రావణాసురుడిని దహించాలి.
ఇంకా డైరెక్టర్ సంపత్ నంది, అనీల్ రావిపూడి, ఎన్‌బికె ఫిల్మ్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, కె.కె.రాధామోహన్, తదితరులు వారి సోషల్ మీడియా ద్వారా దసరా అభినందనలు తెలిపారు.