మెగా ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు!

ABN , First Publish Date - 2020-12-25T18:55:28+05:30 IST

మెగా ఫ్యామిలీలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.

మెగా ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు!

మెగా ఫ్యామిలీలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా ఫ్యామిలీకి చెందిన కజిన్స్ అందరూ క్రిస్మస్ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. తమ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోను అల్లు శిరీష్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఈ వేడుకలను హోస్ట్ చేశారు.


ఈ పార్టీకి బన్నీ, వరుణ్ తేజ్, సాయితేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, నిహారిక, చైతన్య తదితరులు హాజరయ్యారు. ఇక, మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విటర్ ద్వారా అభిమానులకు క్రిస్మస్ విషెస్ తెలిపారు. `క్రిస్మస్‌ పండుగ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ పండుగ‌ మన జీవితాల్లో ఆనందాన్ని, చిరునవ్వును నింపుతుందని ఆశిద్దాం. ఈ హాలీడే సీజన్‌ మీలో నూతన ఉత్తేజాన్ని నింపాలని కోరుకుంటున్నా` అంటూ ట్వీట్ చేశారు.  Updated Date - 2020-12-25T18:55:28+05:30 IST