చలో ఇటలీ!

ABN , First Publish Date - 2020-08-31T05:54:04+05:30 IST

ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధే శ్యామ్‌’ చిత్రం ఇటలీ నేపథ్యంలో చక్కని ప్రేమకథతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్రం బృందం అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించుకొచ్చింది...

చలో ఇటలీ!

ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధే శ్యామ్‌’ చిత్రం ఇటలీ నేపథ్యంలో చక్కని ప్రేమకథతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్రం బృందం అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించుకొచ్చింది. ఆ సమయంలో ఇటలీలో కరోనా ఉదృతి ఎక్కువగా ఉండడంతో షూటింగ్‌కి స్వస్తి చెప్పి ఇండియాకు తిరిగొచ్చారు. ఇంకా 30 శాతం షూటింగ్‌ చేయాల్సి ఉందని సమాచారం. హైదరాబాద్‌, ఇటలీలో 30 రోజులు షూటింగ్‌ చేస్తే సినిమా పూర్తవుతుంది. తాజాగా ‘రాధేశ్యామ్‌’ చిత్ర బృందం మరోసారి ఇటలీ వెళ్లనుంది. ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభాస్‌ సెట్‌లో అడుగుపెట్టబోతున్నారు. కీలక సన్నివేశాలు, పాటల చిత్రీకరణ కోసం తగిన నియమాలతో సెప్టెంబర్‌ మొదటివారంలో ప్రభాస్‌ తన టీమ్‌తో ఇటలీకి పయనం కానున్నారు. అక్కడ చిత్రీకరణ పూర్తయ్యాక హైదరాబాద్‌లో కూడా చిత్రీకరణ జరుపుతారని చిత్ర వర్గాల నుంచి సమాచారం. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. పూజా హెగ్డే కథానాయిక. భాగ్యశ్రీ కీలక పాత్రలో కనిపిస్తారు. 

Updated Date - 2020-08-31T05:54:04+05:30 IST