నూతన సంవత్సర కానుకగా ‘చిత్రం ఎక్స్‌’

ABN , First Publish Date - 2020-12-27T23:15:59+05:30 IST

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలతో నడుస్తోన్న థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? రారా? అనే అనుమానాలతో ఉన్న దర్శకనిర్మాతలకు డిసెంబర్‌ 25న

నూతన సంవత్సర కానుకగా ‘చిత్రం ఎక్స్‌’

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలతో నడుస్తోన్న థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? రారా? అనే అనుమానాలతో ఉన్న దర్శకనిర్మాతలకు డిసెంబర్‌ 25న విడుదలైన సాయితేజ్‌ 'సోలో బ్రతుకే సో బెటర్‌' చిత్రం క్లారిటీ ఇచ్చేసింది. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్‌తో.. ఇప్పటికే రెడీ అయిన చిత్రాలను వదిలేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే జనవరి 1న నూతన సంవత్సర కానుగా బేబీ రాజశ్రీ సమర్పణలో శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి దేవి మూవీ క్రియేషన్స్ పతాకంపై రాజ్ బాల, మానస హీరో హీరోయిన్లుగా రమేష్ విభూది దర్శకత్వంలో.. నిర్మాత పొలం గోవిందయ్య నిర్మించిన "చిత్రం X"ను విడుదల చేయబోతోన్నట్లుగా దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో సీనియర్ దర్శకుడు సాగర్ చేతుల మీదుగా ఈ చిత్ర సెకండ్ టైలర్‌ను విడుదల చేశారు.


‘‘తక్కువ బడ్జెట్‌లో ఇంత మంచి సినిమా తీసిన దర్శకుడిని అభినందించాలి. కథను నమ్మి సినిమా చేయడానికి ముందుకు వచ్చిన నిర్మాతకు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి. జనరల్‌గా జనవరి ఫస్ట్ వీక్ లో చాలా సినిమాలు ఉన్నా జనవరి 1, 2021 న విడుదల అవుతున్న ఈ "చిత్రం X" గతంలో విడుదలై ఘన విజయం సాధించిన "చిత్రం" సినిమా అంత పెద్ద విజయం సాధించాలి. ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ లందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని ట్రైలర్ విడుదల అనంతరం దర్శకుడు సాగర్ తెలిపారు. ఈ చిత్ర కథ ఇంట్రెస్ట్‌గా ఉంటుందని, ప్రేక్షకులందరినీ మెప్పిస్తుందని, అందరూ ఈ సినిమాని చూసి ఆశీర్వదించాలని చిత్ర దర్శకనిర్మాతలు కోరారు.

Updated Date - 2020-12-27T23:15:59+05:30 IST