పరుచూరి వెంకటేశ్వరరావుకు చిరంజీవి ప‌రామ‌ర్శ‌

ABN , First Publish Date - 2020-08-07T16:13:53+05:30 IST

విజయలక్ష్మి మరణవార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి పరుచూరి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి పరామర్శించారు.

పరుచూరి వెంకటేశ్వరరావుకు చిరంజీవి ప‌రామ‌ర్శ‌

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు స‌తీమ‌ణి పరుచూరి విజయలక్ష్మి శుక్ర‌వారం తెల్ల‌వారుజామున గుండెపోటుతో చనిపోయారు.  విజయలక్ష్మి మరణవార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి పరుచూరి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి పరామర్శించారు. తన ప్రగాఢ సానభూతిని తెలిపారు. పరుచూరి వెంకటేశ్వరరావు తనకు ఎంతో ఆత్మీయుడని, ఆ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. విజయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని చిరంజీవి అన్నారు.

Updated Date - 2020-08-07T16:13:53+05:30 IST