రెబల్‌స్టార్‌కు మెగాస్టార్ విషెస్!
ABN , First Publish Date - 2020-10-23T22:32:46+05:30 IST
పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రెబల్‌స్టార్ ప్రభాస్‌కు సోషల్ మీడియా ద్వారా బర్త్‌డే విషెస్ హోరెత్తుతున్నాయి.

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రెబల్‌స్టార్ ప్రభాస్‌కు సోషల్ మీడియా ద్వారా బర్త్‌డే విషెస్ హోరెత్తుతున్నాయి. ఈ రోజు (శుక్రవారం) 41వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న ప్రభాస్‌కు సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా పెద్ద సంఖ్యలో విషెస్ చెబుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రభాస్‌కు విషెస్ తెలియజేశారు. `ప్రియమైన ప్రభాస్‌కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా. ఈ సంవత్సరమంతా నీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా` అంటూ చిరంజీవి పేర్కొన్నారు. గతంలో ప్రభాస్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.
Read more