కాజల్ దంపతులకు మెగాశీస్సులు!

ABN , First Publish Date - 2020-12-15T18:13:45+05:30 IST

చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

కాజల్ దంపతులకు మెగాశీస్సులు!

చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 30న ముంబై తాజ్ హోటల్‌లో వీరి వివాహం జరిగింది. కరోనా కారణంగా తక్కువ మంది అతిథులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. వివాహం తర్వాత ఈ కొత్త జంట మాల్దీవులకు హనీమూన్ కోసం వెళ్లింది. 


అక్కడి నుంచి తిరిగి వచ్చిన కాజల్ `ఆచార్య` షూటింగ్‌కు హాజరైంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జరుగుతున్న షూటింగ్‌లో చిరంజీవి, కాజల్, ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటోంది. కాజల్ భర్త గౌతమ్ తాజాగా `ఆచార్య` సెట్‌కు వచ్చి అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. దీంతో `ఆచార్య` యూనిట్ కాజల్ దంపతులకు ప్రత్యేక విషెస్ తెలియజేసింది. మెగాస్టార్ చిరంజీవి ఎదుట కాజల్, గౌతమ్ దండలు మార్చుకున్నారు. కేక్ కట్ చేశారు. అనంతరం చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌లో చిరంజీవితోపాటు దర్శకుడు కొరటాల శివ, సినిమాటోగ్రాఫర్ తిరు, నిర్మాతలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T18:13:45+05:30 IST

Read more