మీ సంకల్పబలం అనితరసాధ్యం: చంద్రబాబుకు చిరు విషెస్

ABN , First Publish Date - 2020-04-20T14:47:42+05:30 IST

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవి చంద్ర‌బాబుకు త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభినంద‌న‌ల‌ను తెలిపారు.

మీ సంకల్పబలం అనితరసాధ్యం: చంద్రబాబుకు చిరు విషెస్

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పుట్టిన‌రోజు నేడు(ఏప్రిల్ 20). ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు ప్ర‌ముఖులు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లను తెలియ‌జేస్తున్నారు. టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవి చంద్ర‌బాబుకు త‌న ట్విట్ట‌ర్ ద్వారా జన్మదిన శుభాంకాంక్షలు తెలిపారు. ‘‘అహర్నిశం ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం  ప్రసాదించమని ఆ భగవంతుణ్ని కోరుతున్నాను. మీకు 70వ పుట్టినరోజు శుభాకాంక్ష‌లు. మీ దూర‌దృష్టి, క‌ష్టించే త‌త్వం, మీ అంకిత భావం చాలా గొప్ప‌వి’’ అని ఆయనతో ఉన్న ఫొటోను చిరంజీవి ట్వీట్ చేశారు.Updated Date - 2020-04-20T14:47:42+05:30 IST