చివరికి భళ్లాలదేవుడికి ప్రేయసి దొరికింది: చిరంజీవి

ABN , First Publish Date - 2020-05-13T00:25:36+05:30 IST

రానా దగ్గుబాటి తనకు కాబోయే భార్యను పరిచయం చేశారు. తాజాగా ఆయన తన ట్విట్టర్

చివరికి భళ్లాలదేవుడికి ప్రేయసి దొరికింది: చిరంజీవి

హైదరాబాద్: రానా దగ్గుబాటి తనకు కాబోయే భార్యను పరిచయం చేశారు. తాజాగా ఆయన తన ట్విట్టర్‌లో తన కాబోయే భార్యతో ఉన్న ఫొటోని పోస్ట్ చేసి ‘ఆమె ఒప్పుకుంది’ అని తెలిపారు. ఇంతకీ రానా చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా? ‘మిహిక బజాజ్’. అయితే రానా ప్రకటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 


‘‘రానా దగ్గుబాటికి శుభాకాంక్షలు. చివరికి భళ్లాలదేవుడికి ప్రేయసి దొరికింది.. వాళ్లు ముడిపడబోతున్నారు. లాక్‌డౌన్ కాస్త వెడ్‌లాక్ అవుతుంది. ఇద్దరికి దేవుడి ఆశీస్సులు ఉండాలి. శతమానం భవతి’ అంటూ చిరంజీవి రానాను ఆశీర్వదిస్తూ ట్వీట్ చేశారు. Updated Date - 2020-05-13T00:25:36+05:30 IST