చాలా గ్యాప్ తర్వాత పోస్ట్‌మ్యాన్‌పై ట్వీట్ చేసిన చిరు

ABN , First Publish Date - 2020-07-12T01:47:12+05:30 IST

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌మ్యాన్ వార్త హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన డి. శివన్ అనే పోస్ట్‌మ్యాన్ క్రూరమృగాలు

చాలా గ్యాప్ తర్వాత పోస్ట్‌మ్యాన్‌పై ట్వీట్ చేసిన చిరు

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌మ్యాన్ వార్త హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన డి. శివన్ అనే పోస్ట్‌మ్యాన్ క్రూరమృగాలు సంచరించే ప్రాంతంలో నిత్యం 15 కి.మీ. నడుస్తూ ఉత్తరాలు బట్వాడా చేసేవాడంటూ ఓ జాతీయ దినపత్రికలో వచ్చిన వార్త సోషల్ మీడియాని తాకి సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆయన పదవీ విరమణ చేసినప్పటికీ.. ఇప్పుడెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అయితే చాలా రోజుల నుంచి ట్విట్టర్‌లో సందడి చేయని మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా ఈ పోస్ట్‌మ్యాన్‌పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు.


‘‘ఇలా జరిగేందుకు అవకాశం ఉంది. ఎందరో వ్యక్తులు తమకు కేటాయించిన పనిని పూర్తి చేయడాన్ని చాలా సంతృప్తిగా భావిస్తారు. ఎన్ని కష్టాలు ఎదురైనా వారి విధి నిర్వహణే వారికి సంతృప్తిని ఇస్తుంది. ఇలాంటి గొప్పవారికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలపాలి. ప్రపంచానికి తెలియని హీరోలు వీళ్లు’’ అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చిరు చేసిన ఈ ట్వీట్‌కు ఆయన అభిమానులు.. ‘మీరు కూడా ఇలా కష్టపడే కదా సార్.. మెగాస్టార్ అయ్యారు..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Updated Date - 2020-07-12T01:47:12+05:30 IST