ఎయిటీస్ తారలతో చిరు డ్యాన్స్.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2020-05-04T02:39:01+05:30 IST

ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఏప్రిల్ 29న ఓ ట్వీట్ చేశారు. డ్యాన్స్‌తో తనకు గల అనుబంధాన్ని, డ్యాన్స్ వలన తనకు దక్కిన

ఎయిటీస్ తారలతో చిరు డ్యాన్స్.. వీడియో వైరల్

ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఏప్రిల్ 29న ఓ ట్వీట్ చేశారు. డ్యాన్స్‌తో తనకు గల అనుబంధాన్ని, డ్యాన్స్ వలన తనకు దక్కిన గౌరవాన్ని ఆయన తెలియజేసిన విషయం తెలిసిందే. ఎలాంటి ఒత్తిడినైనా డ్యాన్స్‌తో అధిగమించవచ్చునని తెలిపిన ఆయన ఈ మధ్య కాలంలో చేసినటువంటి డ్యాన్స్ బిట్స్‌ని షేర్ చేస్తానని తెలిపారు. కాకపోతే బాలీవుడ్‌లో దిగ్గజ నటులైన ఇర్ఫాన్, రిషికపూర్‌ల మృతితో అంతా షాక్‌కి లోనయ్యారు. ఇటువంటి సమయంలో డ్యాన్స్ బిట్స్ చేయడం కరెక్ట్ కాదని తెలిపి డ్యాన్స్ బిట్స్ కార్యక్రమాన్ని చిరంజీవి వాయిదా వేశారు. తాజాగా ఆయన ఆరోజు చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేశారు.


ఇటీవల ఎన‌భైల‌ నాటి తార‌లంతా ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ పేరుతో ప్ర‌తి సంవత్సరం జరుపుకునే వార్షికోత్స‌వ వేడుక‌ను చిరంజీవి కొత్త ఇంట్లో జరుపుకున్న విషయం తెలిసిందే. ప‌దో వార్షికోత్స‌వం కావడంతో ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా ఈ కార్య‌క్ర‌మాన్ని రూపకల్పన చేసి, ఆయ‌నే హోస్టింగ్ చేశారు. ఆ కార్యక్రమంలో ఎనభైల నాటి తారలతో డ్యాన్స్ చేసిన వీడియోని షేర్ చేసిన చిరంజీవి.. స్నేహితులను కలుసుకోవడంలో ఉండే సరదా.. చిన్న చిన్న మూమెంట్స్ వేస్తుంటే ఉండే సరదా.. కలిపి వాగ్దానం చేసినట్లుగానే నా డ్యాన్స్ వీడియోని షేర్ చేస్తున్నానని తెలిపారు. 

Updated Date - 2020-05-04T02:39:01+05:30 IST