నిహారికతో ఉన్న రేర్‌ ఫొటో షేర్‌ చేసిన మెగాస్టార్‌

ABN , First Publish Date - 2020-12-08T16:42:08+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి తన ట్విట్టర్‌లో చిన్నప్పటి నిహారికతో ఉన్న ఓ అరుదైన ఫొటోను షేర్‌ చేసుకున్నారు.

నిహారికతో ఉన్న రేర్‌ ఫొటో షేర్‌ చేసిన మెగాస్టార్‌

మెగా బ్రదర్‌ నాగబాబు తనయ నిహారిక కొణిదెల వివాహానికి ముహూర్తం దగ్గర పడుతుంది. ఇప్పటికే రెండు కుటుంబాలకు చెందిన వారందరూ ఉదయపూర్‌ ప్యాలెస్‌కు చేరుకున్నారు. సోమవారం రాత్రి సంగీత్‌ కార్యక్రమం జరిగింది. ఇందులో వధువరులు నిహారిక, చైతన్య.. చిరంజీవి సినిమాలో పాటలకు డాన్స్‌ చేసి అలరించారు. రెండు, మూడు రోజుల నుంచి నిహారిక పెళ్లి ఫొటోలు వీడియోలు నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి తన ట్విట్టర్‌లో చిన్నప్పటి నిహారికతో ఉన్న ఓ అరుదైన ఫొటోను షేర్‌ చేసుకున్నారు. "మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే  దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు.గాడ్‌ బ్లెస్‌ యు" అంటూ చిరంజీవి ట్వీట్ తో కాబోయే దంపతులను చిరు ఆశీర్వదించారు. బుధవారం రాత్రి(డిసెంబర్‌ 9) 7గంటల 15 నిమిషాలకు.. గుంటూరు రిటైర్డ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్‌రావు తనయుడు వెంకట్‌ చైతన్యతో నిహారిక వివాహం జరగనుంది. 
Updated Date - 2020-12-08T16:42:08+05:30 IST