గుండెపోటుతో చిరంజీవి సర్జా మృతి

ABN , First Publish Date - 2020-06-08T04:18:35+05:30 IST

కన్నడ నటుడు చిరంజీవి సర్జా(39) కన్ను మూశారు. శ్వాసకోశ సమస్య, ఛాతీ నొప్పితో బెంగుళూరులోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు...

గుండెపోటుతో చిరంజీవి సర్జా మృతి

కన్నడ నటుడు చిరంజీవి సర్జా(39) కన్ను మూశారు. శ్వాసకోశ సమస్య, ఛాతీ నొప్పితో బెంగుళూరులోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. చిరంజీవి సర్జా హీరో అర్జున్‌కు మేనల్లుడు అవుతారు. 2009లో హీరోగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన పదేళ్లలో 20 సినిమాల్లో నటించారు. ‘చంద్రలేఖ’, ‘అజిత్‌, ‘ఆకే’, ‘శివార్జున’, ‘ఖాకీ’, ‘ఆద్యా’, ‘శివార్జున’ చిత్రాలు హీరోగా గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఉన్న నాలుగు సినిమాలు నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్నాయి. మొదట్లో నాలుగేళ్లు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. నటి మేఘనా రాజ్‌ను 2018లో ఆయన వివాహం చేసుకున్నారు. భర్త మరణవార్తతో మేఘన కుప్పకూలిపోయారు. పలువురు సినీ ప్రముఖులు చిరంజీవి సర్జా మరణం పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.   కాగా అతనికి కరోనా పరీక్షలు జరపాలని కర్ణాటక వైద్య, ఆరోగ్యశాఖ అపోలో ఆసుపత్రి వర్గాలకు సూచించింది. 

ఆంధ్రజ్యోతి, బెంగళూరు


Updated Date - 2020-06-08T04:18:35+05:30 IST