చిరంజీవి అలా అన్నారు

ABN , First Publish Date - 2020-12-21T07:11:14+05:30 IST

తెరపై విలన్‌ పాత్ర పోషించిన సోనూసూద్‌ నిజ జీవితంలో మాత్రం అవసరంలో ఉన్న పేద ప్రజలను ఆదుకుంటూ రియల్‌ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు...

చిరంజీవి అలా అన్నారు

తెరపై విలన్‌ పాత్ర పోషించిన సోనూసూద్‌ నిజ జీవితంలో మాత్రం అవసరంలో ఉన్న పేద ప్రజలను ఆదుకుంటూ రియల్‌ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక మీదట తాను విలన్‌ పాత్రలు చేయనని ఓ ఇంటర్వ్యూలో సోనూసూద్‌ చెప్పారు. చిరంజీవితో ‘ఆచార్య’ షూటింగ్‌లో జరిగిన అనుభవాలను సోనూసూద్‌ ప్రస్తావించారు. ఈ చిత్రంలో ఆయన విలన్‌గా నటిస్తున్నారు. యాక్షన్‌ సీన్లలో చిరంజీవి సోనూసూద్‌ను కొట్టేందుకు ఇబ్బందిపడ్డారట. ‘‘‘ప్రజల మనస్సుల్లో గొప్ప మనిషిగా స్థానం సంపాదించుకున్న నిన్ను యాక్షన్‌ సన్నివేశాల్లో కొట్టాలంటే ఇబ్బందిగా ఉంది. నిన్ను కొడితే ప్రజలు ఇష్టపడరు’ అని చిరంజీవి అన్నారు. ఇప్పుడు హీరోగా నాకు అవకాశాలు వస్తున్నాయి. నాలుగు కథలు విన్నాను. ఇకమీదట విలన్‌ పాత్రలు చేయాలనుకోవడం లేదు’’ అని సోనూసూద్‌ చెప్పారు.

Updated Date - 2020-12-21T07:11:14+05:30 IST

Read more