కొరటాల తనకు పిల్లలు వద్దనుకోవడానికి కారణమిదే

ABN , First Publish Date - 2020-04-06T03:45:11+05:30 IST

సూపర్ సక్సెస్ చిత్రాల దర్శకుడు కొరటాల శివతో చిత్రం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి, ఆయన గొప్పతనాన్ని తాజాగా ఆంధ్రజ్యోతి డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు

కొరటాల తనకు పిల్లలు వద్దనుకోవడానికి కారణమిదే

సూపర్ సక్సెస్ చిత్రాల దర్శకుడు కొరటాల శివతో చిత్రం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి, ఆయన గొప్పతనాన్ని తాజాగా ఆంధ్రజ్యోతి డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కొరటాల శివలోని సేవాతత్పరత తనకు ఎంతో నచ్చిందని తెలిపిన చిరంజీవి, తన గురించి ఎవరికీ తెలియని ఓ సంచలన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు. పిల్లలు పుడితే స్వార్థంతో సమాజానికి ఏమీ చేయలేమని... బిడ్డలు వద్దనుకున్న కొరటాల దంపతులను చిరంజీవి కొనియాడారు.


చిరంజీవి పూర్తి ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


‘‘ఆచార్య నిమిత్తం అతనితో ఇంటరాక్ట్‌ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత కొరటాల శివ లోతైన వ్యక్తిగా కనిపించాడు. సమాజం పట్ల ఎంతో అవగాహన, మేధస్సు ఉన్న వ్యక్తి. జాతీయ, అంతర్జాతీయ విషయాలపై పట్టున్న వ్యక్తి. దిగజారుతున్న రాజకీయలు, నాయకుల వ్యక్తిత్వాలు-ప్రవర్తన గురించి అతనిలో ఆందోళన ఎక్కువ. డబ్బు తీసుకుని ఓట్లు వేస్తున్న ప్రజల గురించి వ్యధతో మాట్లాడతాడు. కొరటాల శివలోని సేవాతత్పరత నాకు బాగా నచ్చింది. శ్రీమతితో కలిసి తన ఆదాయంలో కొంత భాగాన్ని సమాజసేవకు వెచ్చించే వ్యక్తి కొరటాల. పిల్లలు పుడితే స్వార్థంతో సమాజానికి ఏమీ చేయలేమని... బిడ్డలు వద్దనే కఠోర నిర్ణయం తీసుకున్న గొప్ప జంట. గొప్ప వ్యక్తిత్వం, సామాజిక స్పృహ ఉన్న తనతో సినిమా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. అతని చిత్రాల్లో ఆ భావాలు కనపడతాయి. కొరటాల శివ వామపక్ష భావాలున్న మనిషి. ఆ నేపథ్యం నుండి వచ్చాడు. అతని వ్యక్తిగత భావజాలం ‘ఆచార్య’లోని నా పాత్రలో కనపడుతుంది..’’ అని చిరంజీవి ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.

Updated Date - 2020-04-06T03:45:11+05:30 IST