ఆమె నాకు స్ఫూర్తి: చిరంజీవి

ABN , First Publish Date - 2020-08-27T14:37:35+05:30 IST

`మనం మాట్లాడే ప్రతి పలుకు ప్రేమతో ఉండాలి. మనం ఎక్కడికెళ్తే అక్కడ ప్రేమను పంచాలి

ఆమె నాకు స్ఫూర్తి: చిరంజీవి

`మనం మాట్లాడే ప్రతి పలుకు ప్రేమతో ఉండాలి. మనం ఎక్కడికెళ్తే అక్కడ ప్రేమను పంచాలి` అని మదర్ థెరీసా చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఆమెకు  మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం మదర్ థెరీసా 110వ జన్మదినోత్సవం. 


ఈ సందర్భంగా మదర్ థెరీసా స్ఫూర్తిని చిరంజీవి ట్విటర్ ద్వారా గుర్తు చేసుకున్నారు. `మనం మాట్లాడే ప్రతి పలుకు ప్రేమతో ఉండాలి. మనం ఎక్కడికెళ్తే అక్కడ ప్రేమను పంచాలి.. మదర్ థెరీసా 110వ జన్మదినోత్సవం సందర్భంగా గొప్ప మాతృమూర్తిని, నా స్ఫూర్తి ప్రధాతను గుర్తు చేసుకుంటున్నా. ఆమె సూచించిన స్వార్థరహిత ప్రేమ, మానవత్వం ఈ ప్రపంచానికి అవసరం` అని చిరంజీవి పేర్కొన్నారు. 
Updated Date - 2020-08-27T14:37:35+05:30 IST