కేసీఆర్, తలసానికి కృతజ్ఞతలు తెలిపిన చిరు

ABN , First Publish Date - 2020-06-08T23:52:03+05:30 IST

తెలంగాణలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతినిచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై కేసీఆర్ సంతకం

కేసీఆర్, తలసానికి కృతజ్ఞతలు తెలిపిన చిరు

తెలంగాణలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతినిచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై కేసీఆర్ సంతకం చేశారు. రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులు నిర్వహించుకోవచ్చని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని తెలిపారు. అదే సమయంలో థియేటర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున సినిమా హాళ్లను ఓపెన్ చేసే విషయమై ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఆయనకు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.


‘‘వేలాది మంది దినసరి వేతన కార్మికుల బతుకు తెరువుని దృష్టిలో ఉంచుకుని సినిమా, టీవీ షూటింగ్స్ కి అనుమతి మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి,విధి విధానాలు రూపొందించి సహకరించిన శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారికి, ప్రభుత్వాధికారులకు కృతజ్ఞతలు.Thank You Sir. @TelanganaCMO’’ అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.



Updated Date - 2020-06-08T23:52:03+05:30 IST