సురేఖ ద‌గ్గ‌ర క్రెడిట్ నాకే: చిరంజీవి

ABN , First Publish Date - 2020-04-28T15:33:55+05:30 IST

కరోనా లాక్‌డౌన్ వ‌ల్ల ఇంటికే ప‌రిమిత‌మైన మెగాస్టార్ చిరంజీవి నిన్న ఓ పాట‌ను ప‌దే ప‌దే వింటున్నాన‌ని, దీనికి కార‌ణం మంగళ‌వారం ఉద‌యం తొమ్మిది గంట‌ల‌కు చెబుతాన‌ని ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న చెప్పిన‌ట్లుగానే ఈరోజు(మంగ‌ళ‌వారం) ఉద‌యం 9 గంట‌లకు సీక్రెట్‌ను రివీల్ చేశారు.

సురేఖ ద‌గ్గ‌ర క్రెడిట్ నాకే:  చిరంజీవి

కరోనా లాక్‌డౌన్ వ‌ల్ల ఇంటికే ప‌రిమిత‌మైన మెగాస్టార్ చిరంజీవి నిన్న ఓ పాట‌ను ప‌దే ప‌దే వింటున్నాన‌ని, దీనికి కార‌ణం మంగళ‌వారం ఉద‌యం తొమ్మిది గంట‌ల‌కు చెబుతాన‌ని ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న చెప్పిన‌ట్లుగానే ఈరోజు(మంగ‌ళ‌వారం) ఉద‌యం 9 గంట‌లకు సీక్రెట్‌ను రివీల్ చేశారు. లాక్‌డౌన్ ముందు త‌న మ‌న‌వ‌రాలు న‌విష్క‌తో చిరంజీవి స‌ర‌దాగా స‌మ‌యాన్ని గ‌డిపారు. చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’లోని ‘మి మి ... ’ సాంగ్‌ను న‌విష్క బాగా ఎంజాయ్ చేయ‌డ‌మే కాదు.. ఆ పాట‌కు డాన్స్ కూడా చేస్తుంది. త‌న‌కు ఇష్ట‌మైన పాట‌ను పెట్ట‌మ‌ని చిరంజీవి ద‌గ్గ‌ర అల్ల‌రి పెట్టిన న‌విష్క డాన్స్ చేయ‌డాన్ని చిరంజీవి ఎంతో ఎంజాయ్ చేశారు. అంతే కాకుండా  ‘‘సంగీతానికి ఉన్నశక్తి చాలా గొప్పది. ఏడాది నిండిన పాప పాటను వింటూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుందో చూసి ఆనందపడ్డాను. తను పాటను నిజంగానే విని ఎంజాయ్ చేస్తుందో లేదోనని పాటను కాసేపు ఆపి చూశాను. తను నిజంగానే పాటను ఎంజాయ్ చేస్తుంది. పాట నాదే కాబట్టి, అమ్మమ్మ సురేఖ దగ్గర క్రెడిట్ నాకే’’ అంటూ ట్వీట్ కూడా చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ వీడియో చూసిన మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ‘క్యూట్‌నెస్ ఓవ‌ర్‌లోడెడ్‌’ అంటూ ట్విట్ట‌ర్‌లో త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు. 

Updated Date - 2020-04-28T15:33:55+05:30 IST