కళాతపస్విని కలిసిన మెగాస్టార్

ABN , First Publish Date - 2020-11-14T21:18:35+05:30 IST

గురువు కాశీ విశ్వనాథ్‌ను దీపావళి సందర్భంగా.. సతీసమేతంగా మెగాస్టార్ చిరంజీవి కలుసుకున్నారు.

కళాతపస్విని కలిసిన మెగాస్టార్

తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చి, పలు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న డైరెక్టర్‌ కె.విశ్వనాథ్. ఈయనకు, మెగాస్టార్ చిరంజీవికి మధ్య గురు శిష్యుల సంబంధం ఉన్న విషయం అందరికి తెలిసిందే. విశ్వనాథ్ దర్శకత్వంలో చిరు నటించిన 'శుభలేఖ, ఆపద్భాంధవుడు, స్వయంకృషి' వంటి సినిమాలు మెగాస్టార్ కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. చిరంజీవిని మాస్‌ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈ సినిమాలు దగ్గర చేశాయి. అలాంటి గురువు కె.విశ్వనాథ్‌ను దీపావళి సందర్భంగా.. సతీసమేతంగా మెగాస్టార్ చిరంజీవి కలుసుకున్నారు. తన శిష్యుడు తన ఇంటికి రావడం పట్ల కె.విశ్వనాథ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాసేపు ఇద్దరు తమ మధుర జ్ఞాపకాలను, అప్పటి సినిమా విశేషాలను గుర్తు చేసుకున్నారు. విశ్వనాథ్ ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకున్నారు చిరంజీవి. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ "అందరికీ దీపావళి శుభాకాంక్షలు! పండగ అంటే మన ఆత్మీయులని కలవటం,ఇంట్లో పెద్దవారితో సమయం గడపటం..అందుకే ఈ పండగ రోజున మా సినిమా కుటుంబంలోని పెద్దాయన,నాకు గురువు మార్గదర్శి,ఆత్మబంధువు కె.విశ్వనాధ్ గారిని కలిసి,ఆ దంపతులని సత్కరించుకున్నాను. వారితో గడిపిన సమయం సంతోషాన్ని సంతృప్తినిచ్చింది" అన్నారు. .

Updated Date - 2020-11-14T21:18:35+05:30 IST