సామ్‌జామ్: మెగాస్టార్‌కు ఛాలెంజ్

ABN , First Publish Date - 2020-12-22T15:25:31+05:30 IST

ప్రముఖ కథానాయిక సమంత వ్యాఖ్యాతగా `ఆహా`లో ప్రసారమవుతున్న సెలబ్రిటీ టాక్ షో `సామ్ జామ్`.

సామ్‌జామ్: మెగాస్టార్‌కు ఛాలెంజ్

ప్రముఖ కథానాయిక సమంత వ్యాఖ్యాతగా `ఆహా`లో ప్రసారమవుతున్న సెలబ్రిటీ టాక్ షో `సామ్ జామ్`. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవిని కూడా తాజాగా సమంత ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన చిన్న చిన్న వీడియోలను `ఆహా` టీమ్ విడుదల చేస్తోంది. 


తాజాగా మరో వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో చిరంజీవిని `వైవా` హర్ష.. `మీకొక చిన్న ఛాలెంజ్ సర్.. మీరు ఎన్నో హిట్ సినిమాలు చేశారు.. ఒకవేళ రీమేక్ చేయాలంటే మీ పాత్రలను ఎవరు చేయగలర`ని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన చిరంజీవి.. `చరణ్, తారక్, బన్నీ, రవితేజ, ప్రభాస్, విజయ్ దేవరకొండ, మహేష్, పవన్ కల్యాణ్` అని చెప్పారు. ఈ మెగా ఎపిసోడ్ క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న ప్రసారం కాబోతోంది. Updated Date - 2020-12-22T15:25:31+05:30 IST