సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

చిరంజీవి యాక్షన్.. సమంత షాక్!

ABN, First Publish Date - 2020-12-21T15:41:35+05:30

ప్రముఖ ఓటీటీ `ఆహా` కోసం కథానాయిక సమంత నిర్వహిస్తున్న టాక్ షో `సామ్ జామ్`.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ ఓటీటీ `ఆహా` కోసం కథానాయిక సమంత నిర్వహిస్తున్న టాక్ షో `సామ్ జామ్`. ఈ కార్యక్రమం కోసం పలువురు సెలబ్రిటీలను సమంత ఇంటర్వ్యూ చేస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, తమన్నా తదితరులతో సందడి చేసిన సమంత తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కూడా ఇంటర్వ్యూ చేసింది. 


దానికి సంబంధించిన చిన్న వీడియోను తాజాగా ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఇంటర్వ్యూలో బాగంగా సమంత `మీ ఫ్రిజ్‌లో ఎపుడు ఉండే ఓ ఐటెమ్ ఏమిటి ?` అని చిరంజీవిని ప్రశ్నించింది. దీనికి మెగాస్టార్ స్పందిస్తూ ఓ రియాక్షన్ ఇచ్చారు. ఆ రియాక్షన్ చూసిన సమంత, అభిమానులు కేకలు పెట్టారు. వెంటనే చిరంజీవి స్పందిస్తూ `మీరు అనుకున్నది కాదు.. అస్సలు కాదు` అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి ప్రోమో త్వరలోనే బయటకు రాబోతోంది. 



Updated Date - 2020-12-21T15:41:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!