చిరంజీవి యాక్షన్.. సమంత షాక్!

ABN , First Publish Date - 2020-12-21T15:41:35+05:30 IST

ప్రముఖ ఓటీటీ `ఆహా` కోసం కథానాయిక సమంత నిర్వహిస్తున్న టాక్ షో `సామ్ జామ్`.

చిరంజీవి యాక్షన్.. సమంత షాక్!

ప్రముఖ ఓటీటీ `ఆహా` కోసం కథానాయిక సమంత నిర్వహిస్తున్న టాక్ షో `సామ్ జామ్`. ఈ కార్యక్రమం కోసం పలువురు సెలబ్రిటీలను సమంత ఇంటర్వ్యూ చేస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, తమన్నా తదితరులతో సందడి చేసిన సమంత తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కూడా ఇంటర్వ్యూ చేసింది. 


దానికి సంబంధించిన చిన్న వీడియోను తాజాగా ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఇంటర్వ్యూలో బాగంగా సమంత `మీ ఫ్రిజ్‌లో ఎపుడు ఉండే ఓ ఐటెమ్ ఏమిటి ?` అని చిరంజీవిని ప్రశ్నించింది. దీనికి మెగాస్టార్ స్పందిస్తూ ఓ రియాక్షన్ ఇచ్చారు. ఆ రియాక్షన్ చూసిన సమంత, అభిమానులు కేకలు పెట్టారు. వెంటనే చిరంజీవి స్పందిస్తూ `మీరు అనుకున్నది కాదు.. అస్సలు కాదు` అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి ప్రోమో త్వరలోనే బయటకు రాబోతోంది. Updated Date - 2020-12-21T15:41:35+05:30 IST