'మెగా' సాయం... ఉచితంగా ప్లాస్మా వితరణ

ABN , First Publish Date - 2020-09-29T20:21:36+05:30 IST

చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌లో భాగమైన చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా నిస్సహాయులైన పేదలకు ఉచితంగా ప్లాస్మాను అందించనున్నట్లు మెగాభిమానులు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు.

'మెగా' సాయం... ఉచితంగా ప్లాస్మా వితరణ

మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి మెగా మనసును చాటుకున్నారు. చిరంజీవి ఐ అండ్ బ్లడ్‌ బ్యాంక్‌తో ఎంతో మందికి సాయమందిస్తూ అండగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి తన అభిమానుల సహకారంతో మరో సాయం అందించడానికి సిద్ధమయ్యారు.  చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌లో భాగమైన చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా  నిస్సహాయులైన పేదలకు ఉచితంగా ప్లాస్మాను అందించనున్నట్లు మెగాభిమానులు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. తెల్ల రేషన్ కార్డు దారులు , ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోగలరని మెగాభిమానులు ప్రకటించారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ సినీ కార్మికుల కోసం చిరంజీవి అధ్యక్షతన ఏర్పాటైన సీసీసీ మనకోసం సంస్థ.. నిత్యావసర వస్తువులను అందించిన విషయం విదితమే. 
Updated Date - 2020-09-29T20:21:36+05:30 IST