మన జీవితానికి హరివిల్లులు: చిరంజీవి

ABN , First Publish Date - 2020-09-28T16:09:28+05:30 IST

కుమార్తెలు మన జీవితాల్లో వెలుగులు నింపుతారని, వారు తెచ్చే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి.

మన జీవితానికి హరివిల్లులు: చిరంజీవి

కుమార్తెలు మన జీవితాల్లో వెలుగులు నింపుతారని, వారు తెచ్చే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. డాటర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తెలు సుస్మిత, శ్రీజలతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 


కుమార్తెలు మన జీవితానికి హరివిల్లులని పేర్కొంటూ ఇద్దరూ కూతుళ్లతో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ప్రపంచంలోని కుమార్తెలందరికీ డాటర్స్ డే విషెస్ చెప్పారు. అలాగే శ్రీజ కూడా తన కూతుళ్లతో దిగిన ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 


Updated Date - 2020-09-28T16:09:28+05:30 IST