మేనల్లుడికి మెగా ఆశీస్సులు వచ్చేశాయ్‌..

ABN , First Publish Date - 2020-12-24T04:17:48+05:30 IST

థియేటర్లు తెరుచుకున్నా.. కరోనా భయంతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? రారా? అనే అనుమానాలు ఉన్న తరుణంలో ధైర్యంగా మెగా మేనల్లుడు సాయితేజ్‌ తన 'సోలో బ్రతుకే సో బెటర్‌' సినిమాతో

మేనల్లుడికి మెగా ఆశీస్సులు వచ్చేశాయ్‌..

థియేటర్లు తెరుచుకున్నా.. కరోనా భయంతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? రారా? అనే అనుమానాలు ఉన్న తరుణంలో ధైర్యంగా మెగా మేనల్లుడు సాయితేజ్‌ తన 'సోలో బ్రతుకే సో బెటర్‌' సినిమాతో వచ్చేందుకు రెడీ అయ్యాడు. డిసెంబర్‌ 25న ఈ చిత్రం థియేటర్లలో విడుదలయ్యేందుకు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ఎటువంటి రెస్పాన్స్‌ వస్తుందని కాకుండా.. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా.. ప్రేక్షకులు ఈ సినిమా చూడడానికి థియేటర్లకు వస్తారా? రారా? అనే దానిపైనే దృష్టి పెట్టారంటే.. ఎంతగా కరోనా ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీపై ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా సెలబ్రిటీలందరూ.. మేము ఈ సినిమాని థియేటర్లలోనే చూస్తామంటూ.. ప్రేక్షకులలో స్పూర్తినింపేలా ట్వీట్స్‌ చేస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దన్నయ్య, మెగాస్టార్‌ చిరంజీవి.. అటు మేనల్లుడికి ఆశీస్సులు అందిస్తూనే.. చిత్ర పరిశ్రమ భవితవ్యాన్ని ఈ చిత్రం నిర్దేశిస్తుందని ట్వీట్‌ చేశారు. 


''ఈ క్రిస్మస్‌కి విడుదలవుతోన్న 'సోలో బ్రతుకే సో బెటర్‌' చిత్ర టీమ్‌ అందరికీ నా శుభాకాంక్షలు. లాక్‌డౌన్‌ తర్వాత విడుదలవుతోన్న తొలి చిత్రంగా ఇది మొత్తం ఫిల్మ్‌ ఇండస్ట్రీకే ఒక ముఖ్యమైన సందర్భం. ఈ చిత్రానికి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే ఒక స్పూర్తిని, స్థైర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు. అలాగే ప్రేక్షకులందరూ బాధ్యతగా ఫేస్‌ మాస్క్‌లు ధరించి సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటిస్తూ.. ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో ఎంజాయ్‌ చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరూ క్షేమంగా ఉండండి..'' అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Updated Date - 2020-12-24T04:17:48+05:30 IST