ఆ సినిమా ఫ్లాప్.. వెక్కి వెక్కి ఏడ్చిన చిరంజీవి!
ABN, First Publish Date - 2020-12-26T20:53:49+05:30
ప్రముఖ ఓటీటీ `ఆహా` కోసం కథానాయిక సమంత నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో `సామ్ జామ్`లో తాజాగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు.
ప్రముఖ ఓటీటీ `ఆహా` కోసం కథానాయిక సమంత నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో `సామ్ జామ్`. ఈ కార్యక్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. క్రిస్మస్ సందర్భంగా శుక్రవారం నుంచి ఈ కార్యక్రమం స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. `శంకరాభరణం` సినిమా క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నానన్నారు.
అలాగే తను నటించిన `వేట` సినిమా ఫ్లాప్ అయినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చానని వెల్లడించారు. ``ఖైదీ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత.. అదే కాంబినేషన్‌లో `వేట` సినిమా చేశాం. `వేట` కూడా హిట్ అవుతుందనుకున్నాను. కానీ, ఆ సినిమా డిజాస్టర్ అయింది. దాంతో చాలా నిరాశ చెందా. ఇంట్లో దుప్పటి కప్పుకుని ఎంతగానో ఏడ్చాన`ని చిరంజీవి చెప్పారు.