మెగా రీమేక్స్.. చిరు దృష్టిలో సెట్ అయ్యే హీరోలెవరు?

ABN , First Publish Date - 2020-12-26T15:26:57+05:30 IST

ప్రముఖ కథానాయిక సమంత నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో `సామ్‌జామ్`లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు.

మెగా రీమేక్స్.. చిరు దృష్టిలో సెట్ అయ్యే హీరోలెవరు?

ప్రముఖ కథానాయిక సమంత నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో `సామ్‌జామ్`లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. క్రిస్మస్ సందర్భంగా ఈ కార్యక్రమం `ఆహా`లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ కార్యక్రమంలో ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు చిరంజీవి తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. `మీ సూపర్ హిట్ చిత్రాలను రీమేక్ చేయాల్సి వస్తే.. ఇప్పటి హీరోలలో ఎవరు సెట్ అవుతార`ని చిరంజీవిని ప్రశ్నించారు. 


దీనికి స్పందించిన మెగాస్టార్.. `జగదీకవీరుడు.. అతిలోకసుందరి` సినిమా ‌రామ్‌చరణ్ లేదా మహేష్ బాబుకు సూట్ అవుతుందన్నారు. అయితే అతిలోక సుందరిగా సమంత మాత్రమే కనిపించాలన్నారు. అలాగే `ఠాగూర్` సినిమా పవన్ కల్యాణ్‌కి బాగుంటుందన్నారు. `ఇంద్ర` సినిమాకు ప్రభాస్ సూట్ అవుతాడని అభిప్రాయపడ్డారు. ఇక, `ఛాలెంజ్` సినిమాకు బన్నీ లేదా విజయ్ దేవరకొండ పేర్లు సూచించారు. `గ్యాంగ్ లీడర్` పాత్రలో తారక్ లేదా చరణ్ కనిపిస్తే బాగుంటుందన్నారు. `రౌడీ అల్లుడు`కు రవితేజ లేదా బన్నీ సెట్ అవుతారన్నారు. అలాగే `విజేత` సినిమాలో పాత్ర నాగచైతన్యకు సెట్ అవుతుందన్నారు. 'స్వయంకృషి'  సినిమా మాత్రం ఎవరికీ సెట్ అవదని పేర్కొన్నారు.


Updated Date - 2020-12-26T15:26:57+05:30 IST