జర్నలిస్టులకు హోమియో మందులను అందజేస్తున్న రైటర్ చిన్నికృష్ణ

ABN , First Publish Date - 2020-08-19T17:47:48+05:30 IST

హోమియోపతిలో ఆర్సెనిక్ ఆల్బమ్-30 మాత్రలు రోగనిరోధక శక్తి పెంచడంలో బేషుగ్గా పని చేస్తాయని భారత ఆయుష్ మంత్రిత్వశాఖ సైతం చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణగారు జర్నలిస్టులు అందరికీ అందజేయాలని సంకల్పించారు.

జర్నలిస్టులకు హోమియో మందులను అందజేస్తున్న రైటర్ చిన్నికృష్ణ

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ప్రజలపై కరోనా పంజా విసురుతోంది. ఈ వైరస్‌కి ఇంకా వ్యాక్సిన్ రాలేదు కనుక మహమ్మారి బారిన పడకుండా, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రతిఒక్కరూ రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలి. హోమియోపతిలో ఆర్సెనిక్ ఆల్బమ్-30 మాత్రలు రోగనిరోధక శక్తి పెంచడంలో బేషుగ్గా పని చేస్తాయని భారత ఆయుష్ మంత్రిత్వశాఖ సైతం చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణగారు జర్నలిస్టులు అందరికీ అందజేయాలని సంకల్పించారు. గుజరాత్ నుండి ప్రత్యేకంగా తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎఫ్‌జేఏ) సభ్యుల కోసం తెప్పించారు. 


మూడు రోజుల పాటు ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నాలుగు ఆర్సెనిక్ ఆల్బమ్-30 పిల్స్ తీసుకోవాలి. కరోనా రానివారు, ఆల్రెడీ వచ్చి కోలుకున్నవారు కూడా ఈ మెడిసిన్ తీసుకోవచ్చు. ఒక మెడిసిన్ బాటిల్ ఫ్యామిలీలో ఐదుగురికి సరిపోతుంది. ‘‘ఈ మెడిసిన్ మీద అవగాహన కల్పించి, నేను నా కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఎంతోమందికి మేలు జరిగేలా చూసిన డాక్టర్ శ్రీనివాస్ గారి సలహాలు సహాయం మరువలేనిది. 200 సంవత్సరాల క్రితమే ఆర్సెనిక్ ఆల్బమ్-30 హోమియోపతి మెడిసిన్ కనుగొన్న శ్యామ్యూల్ హాలెమాన్ గారికి, ఆయుష్ మంత్రిత్వ శాఖకి నా ధన్యవాదాలు’’ అని చిన్నికృష్ణ తెలిపారు. 

Updated Date - 2020-08-19T17:47:48+05:30 IST