పవన్ చేస్తున్నారు.. చాలా హ్యాపీ: గాయని చిన్మయి

ABN , First Publish Date - 2020-11-17T19:05:19+05:30 IST

గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే కాకుండా సమాజాంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ప్రశ్నించే వ్యక్తిగా గుర్తింపు సంపాదించుకుంది చిన్మయి శ్రీపాద.

పవన్ చేస్తున్నారు.. చాలా హ్యాపీ: గాయని చిన్మయి

గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే కాకుండా సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ప్రశ్నించే వ్యక్తిగా కూడా గుర్తింపు సంపాదించుకుంది చిన్మయి శ్రీపాద. మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి చిన్మయి తరచుగా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంటుంది. తాజాగా తను చూసిన `నేర్కొండ పార్వాయి` సినిమా గురించి ట్వీట్ చేసింది. హిందీలో విజయవంతమైన `పింక్` సినిమాకు `నేర్కొండ పార్వాయి` తమిళ రీమేక్. ఈ సినిమాలో అజిత్ హీరోగా నటించారు. తెలుగులో పవన్ హీరోగా `వకీల్ సాబ్`గా రీమేక్ చేస్తున్నారు. 


`నేను సినిమాలు చాలా తక్కువగా చూస్తాను. అందులోనూ కామెడీ సినిమాలే ఎక్కువగా చూస్తుంటాను. హింస, భావోద్వేగాలు ఎక్కువగా ఉండే సినిమాలను అయితే అస్సలు చూడలేను. `నేర్కొండ పార్వాయి` కూడా అలాంటి సినిమానే అనుకొని భయపడ్డాను. మొత్తం మీద ధైర్యం తెచ్చుకుని ఇటీవల చూశాను. సినిమా చాలా బాగుంది. ఒక మంచి సందేశాన్ని చాలా బాగా చెప్పారు. ఇలాంటి మంచి చిత్రాలను అజిత్ సార్ లాంటి పెద్ద స్టార్లు చేయడం సంతోషకరం. చాలా మందికి ఆ మెసేజ్ చేరుతుంది. చాలా మంది అర్థం చేసుకుంటారు. ఈ సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్‌గారు చేస్తుండడం నిజంగా సంతోషకరమైన విషయం. `నేర్కొండ పార్వాయి`, `డియర్ కామ్రేడ్`, `బ్రోచేవారెవరురా` లాంటి సినిమాలు చేస్తున్న దర్శకులు, రచయితలను చూసి ఎంతో గర్వపడుతున్నాను. మీ అవగాహనకు, సున్నితత్వానికి ధన్యవాదాల`ని చిన్మయి పేర్కొంది. Updated Date - 2020-11-17T19:05:19+05:30 IST