తెరుచుకున్న ప్రాణాంతక మార్కెట్... ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-04-02T11:46:19+05:30 IST

కరోనా వైరస్ రోగుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా నిరంతరం పెరుగుతోంది. భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి వుంది. ప్రభుత్వం కరోనా నియంత్రణకు....

తెరుచుకున్న ప్రాణాంతక మార్కెట్... ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు

కరోనా వైరస్ రోగుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా నిరంతరం పెరుగుతోంది. భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి వుంది. ప్రభుత్వం కరోనా నియంత్రణకు నిరంతరం కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. కానీ అది గణనీయమైన ప్రభావాన్ని చూపించడంలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. ఈప్రాణాంతక వైరస్ చైనాలోని ఊహాన్‌లో ఉద్భవించింది. డిసెంబరులో కరోనా రోగిని గుర్తించాక  అక్కడి జంతువుల మార్కెట్ మూసివేశారు. తాజాగా  చైనాలో రోగుల సంఖ్య తగ్గిన తర్వాత ఈ జంతు మార్కెట్ తెరుచుకున్న విషయం మీడియా ద్వారా వెల్లడైంది. ఈ వార్త వినగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. తాజాగా ప్రముఖ నటి సంధ్య మృదుల్‌ దీనిపై స్పందించారు... "మీరు నిజంగా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారా? మిమ్మల్ని మీరే తినండి"  అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నటి రవీనా కూడా చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు... "మనిషి ఎప్పుడూ గుణపాఠం నేర్చుకోడు. కరోనా నివారణకు ఎన్ని త్యాగాలు చేయవలసి వచ్చింది?  ఎంత ఖర్చు అయ్యింది?.... ఇంతజరిగినా మొరటు అలవాటు మార్చుకోవడం లేదు. జంతువుల దుర్వినియోగం, వన్య ప్రాణులపై జరిగే నేరాల పరంగా చైనా ప్రపంచంలోనే అత్యంత చెత్త దేశం" అని ట్వీట్ చేశారు.

Updated Date - 2020-04-02T11:46:19+05:30 IST