‘చీమ - ప్రేమ మధ్యలో భామ’ విడుదల ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2020-02-16T00:00:55+05:30 IST

మాగ్నమ్ ఓపస్ ఫిలిమ్స్ పతాకంపై శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు దర్శకత్వంలో ఎస్ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘చీమ - ప్రేమ మధ్యలో భామ’. అమిత్ మరియు

‘చీమ - ప్రేమ మధ్యలో భామ’ విడుదల ఎప్పుడంటే..?

మాగ్నమ్ ఓపస్ ఫిలిమ్స్ పతాకంపై శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు దర్శకత్వంలో ఎస్ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘చీమ - ప్రేమ మధ్యలో భామ’. అమిత్ మరియు ఇందు హీరో హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది.


ఈ సందర్భంగా ‘చీమ - ప్రేమ మధ్యలో భామ!’ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు మాట్లాడుతూ.. ‘‘మనుషులలో మంచి మనుషులు వేరు - చిన్న సినిమాలలో ‘చీమ’ సినిమా వేరు. అంటే ఒక వెరైటీ, ఒక నావెల్టీ - అదేంటో తెలియాలంటే మా సినిమాను దగ్గరున్న థియేటర్లో చూడాల్సిందే. ఫిబ్రవరి 21న వస్తుంది..’’ అన్నారు.


నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ‘‘ఈనాటి యువతీయువకులు ప్రేమ విషయంలో ఎంత పరిణితితో ఉన్నారో తెలియచెప్పే చిత్రం ఇది. కాలం మారినా నిజమైన ప్రేమ స్వచ్ఛంగా అన్ని పరీక్షలకు అతీతంగానే ఉంటుంది.. అని తెలియజేయడానికే మా ఈ చిన్న ప్రయత్నం. ఫిబ్రవరి 21న థియేటర్లలోనికి వస్తుంది. చూసి ఆదరించండి’’ అని అన్నారు.  


ఈ కాన్సెఫ్ట్ బేస్డ్ సినిమాలో హీరో పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర లభించినందుకు సంతోషంగా ఉంది అని అన్నారు హీరో అమిత్.

Updated Date - 2020-02-16T00:00:55+05:30 IST