హైదరాబాద్‌లో ‘చెక్‌’

ABN , First Publish Date - 2020-10-18T06:41:31+05:30 IST

నితిన్‌ కథానాయకుడిగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘చెక్‌’. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్నారు...

హైదరాబాద్‌లో ‘చెక్‌’

నితిన్‌ కథానాయకుడిగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘చెక్‌’. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘చదరంగం నేపథ్యంలో ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథతో చిత్రం రూపొందుతోంది. నటుడిగా నితిన్‌ స్థాయిని పెంచే చిత్రమిది. చంద్రశేఖర్‌ యేలేటి చాలా విభిన్నంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నితిన్‌, రకుల్‌, సాయి చంద్‌, సంపత్‌ రాజ్‌ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్‌ నవంబర్‌ 5వ తేదీ వరకూ కొనసాగుతుంది. దీంతో దాదాపుగా చిత్రీకరణ పూర్తవుతుంది. సినిమా టైటిల్‌ ‘చెక్‌’కి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది’’ అన్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో మురళీ శర్మ, హర్షవర్థన్‌, రోహిత్‌, సిమ్రాన్‌ చౌదరి ఇతర తారాగణం.

Updated Date - 2020-10-18T06:41:31+05:30 IST