నా శరీరం బాగుంటుంది కాబట్టే చూపిస్తున్నా: నటి ఘాటు కౌంటర్

ABN , First Publish Date - 2020-06-05T17:33:38+05:30 IST

తన డ్రెస్సింగ్ గురించి అసభ్యకర కామెంట్ చేసిన నెటిజన్‌కు బాలీవుడ్‌ బుల్లితెర నటి చారు అసోపా ఘాటు కౌంటర్ ఇచ్చింది.

నా శరీరం బాగుంటుంది కాబట్టే చూపిస్తున్నా: నటి ఘాటు కౌంటర్

తన డ్రెస్సింగ్ గురించి అసభ్యకర కామెంట్ చేసిన నెటిజన్‌కు బాలీవుడ్‌ బుల్లితెర నటి చారు అసోపా ఘాటు కౌంటర్ ఇచ్చింది. మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ భార్య అయిన చారు అసోపా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. రెడ్‌ కలర్‌ క్రాప్‌ జాకెట్‌ ధరించి ఓ పాటకు డ్యాన్స్ వేసిన వీడియోను కూడా పోస్ట్ చేసింది. 


చారు పోస్ట్‌పై కొందరు ట్రోలింగ్ చేశారు. `నీ డ్రెస్సింగ్ సరిగ్గా లేదు.. అలాంటి దుస్తులు ధరించడానికి సిగ్గుగా లేదా` అంటూ విమర్శించారు. ఓ నెటిజన్.. `ఆ జాకెట్ మాత్రం ఎందుకు` అంటూ కామెంట్ చేశారు. దీనికి స్పందించిన చారు.. `నా శరీరం అందంగా ఉంటుంది కాబట్టి దానిని చూపించాలనుకుంటాను. ఒకవేళ మీకు కూడా అందమైన శరీరం ఉంటే మీరు కూడా చూపించుకోండి` అంటూ కౌంటర్ వేసింది.  

Updated Date - 2020-06-05T17:33:38+05:30 IST