చంద్రబోస్ @ 25ఇయర్స్!

ABN , First Publish Date - 2020-05-27T20:37:02+05:30 IST

`తాజ్‌మహల్` సినిమాతో పాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసిన చంద్రబోస్ విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.

చంద్రబోస్ @ 25ఇయర్స్!

`తాజ్‌మహల్` సినిమాతో పాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసిన చంద్రబోస్ విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 1995లో విడుదలైన `తాజ్‌మహల్`లో `మంచుకొండల్లోన చంద్రమా` పాట సినీ రచయితగా చంద్రబోస్‌కు తొలి గీతం. ఎమ్ ఎమ్ శ్రీలేఖ ఈ సినిమాకు సంగీతం అందించారు. 


ఆ తర్వాత అందరి సంగీత దర్శకుల వద్ద చంద్రబోస్ పనిచేశారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. 25 ఏళ్ల ప్రస్థానం పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా ద్వారా చంద్రబోస్ తన ఆనందాన్ని పంచుకున్నారు. `నా 25 సంవత్సరాల సాహితీ ప్రయాణంలో తోడున్న ఎంతో మంది నిర్మాతలకు, దర్శకులకు, సంగీత దర్శకులకు, గాయనీ గాయకులకు శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాను` అని చంద్రబోస్ ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-05-27T20:37:02+05:30 IST