హ్యాపీ బర్త్‌డే మై లవ్: నిహారికకు చైతన్య విషెస్

ABN , First Publish Date - 2020-12-18T19:07:55+05:30 IST

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇటీవలె జొన్నలగడ్డ కుటుంబ కోడలిగా మారింది.

హ్యాపీ బర్త్‌డే మై లవ్: నిహారికకు చైతన్య విషెస్

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇటీవలె జొన్నలగడ్డ కుటుంబ కోడలిగా మారింది. ఈ నెల 9న ఉదయ్‌పూర్‌లో జరిగిన వివాహ వేడుకలో చైతన్యతో కలిసి ఆమె ఏడడుగులు వేసింది. ఈ రోజు (శుక్రవారం) నిహారిక జన్మదినోత్సవం. వివాహం తర్వాత వచ్చిన మొదటి పుట్టిన రోజు కావడంతో నిహారికకు ఈ బర్త్ డే మరింత ప్రత్యేకంగా మారింది. 


నిహారికకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చైతన్య విషెస్ తెలియజేశాడు. `హ్యాపీ బర్త్ డే మై లవ్. ఈ బర్త్ డే చాలా సంతోషకరంగా ఉండాలి. షైన్ ఆన్ మై సన్ ఫ్లవర్` అంటూ విషెస్ చెప్పాడు. అలాగే ఓ చక్కని ఫొటోను పోస్ట్ చేశాడు. నిహారిక బర్త్ డే వేడుకలు హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరుగుతున్నట్టు సమాచారం. Updated Date - 2020-12-18T19:07:55+05:30 IST