న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌.. గోవాకు చై-సామ్‌!

ABN , First Publish Date - 2020-12-30T16:51:46+05:30 IST

నూతన సంవత్సరానికి ఇంకా రెండు రోజులే ఉండడంతో అందరూ న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్నారు

న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌.. గోవాకు చై-సామ్‌!

నూతన సంవత్సరానికి ఇంకా రెండు రోజులే ఉండడంతో అందరూ న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్నారు. గోవాలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు సినీ ప్రముఖులు సిద్ధమవుతున్నారు. అక్కినేని కపుల్ నాగచైతన్య, సమంత కూడా తాజాగా గోవాకి పయనమయ్యారు. 


హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం గోవా బయల్దేరారు. విమానాశ్రయంలో ఉన్న చైతన్య, సమంత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గోవాలోని ప్లష్‌ రిసార్ట్‌లో వీరు న్యూ ఇయర్‌ వేడుకలను జరుపుకోబోతున్నారు. కాగా, 2017లో గోవాలోని ఓ రిసార్ట్‌లోనే వీరి వివాహం జరిగింది.

Updated Date - 2020-12-30T16:51:46+05:30 IST