చైతన్య, నిహారిక పెళ్లి ముహూర్తం ఖరారు
ABN , First Publish Date - 2020-11-04T22:57:15+05:30 IST
గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు చైతన్య జొన్నలగడ్డ, మెగాడాటర్ నిహారిక కొణిదెల వివాహానికి ముహూర్తం కుదిరింది. డిసెంబర్ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారైనట్లు ప్రభాకర్ రావు తెలిపారు.

గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు చైతన్య జొన్నలగడ్డ, మెగాడాటర్ నిహారిక కొణిదెల వివాహానికి ముహూర్తం కుదిరింది. డిసెంబర్ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారైనట్లు ప్రభాకర్ రావు తెలిపారు. తిరుమల స్వామివారి దర్శనం చేసుకుని, ఆయన పాదాల వద్ద వివాహ పత్రికను ఉంచి ఆశీర్వాదం తీసుకున్న ప్రభాకర్ రావు దంపతులు పెళ్లి ముహూర్తం గురించిన వివరాలను తెలిపారు. అలాగే పెళ్లిని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి చేయబోతున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.
Read more