నటుడు రావి కొండలరావుకి చదలవాడ ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2020-05-14T23:57:58+05:30 IST

ఈ కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న అనేక మంది నిర్మాతలకు, సినీ కార్మికులకు, మీడియా వారికి, యూనియన్ కార్డ్ లేని ఆర్టిస్టులకు

నటుడు రావి కొండలరావుకి చదలవాడ ఆర్థిక సాయం

ఈ కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న అనేక మంది నిర్మాతలకు, సినీ కార్మికులకు, మీడియా వారికి, యూనియన్ కార్డ్ లేని ఆర్టిస్టులకు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు సహాయం చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు సీనియర్ నటుడు మరియు విజయ ప్రొడక్షన్స్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేసిన రావికొండలరావు ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని అతనికి వెంటనే సహాయం చేయాలని ప్రసన్నకుమార్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణను పురమాయించిన ఆయన.. రావికొండలరావుకి రూ. 50,000/- ఆర్థిక సహాయం అందించారు.


ఈ సందర్భంగా రావికొండలరావు మాట్లాడుతూ.. ‘‘చదలవాడ శ్రీనివాసరావుగారికి ధన్యవాదాలు. నా స్థితిని గుర్తించి, నన్ను అమితంగా గౌరవించి, నిర్మాతల మండలి ద్వారా రూ. 50 వేలు చెక్కు పంపి, కృతర్థుడిని చేసిన మీ ఔదార్యానికి, సహృదయానికీ వందన సహస్రాలు అర్పిస్తున్నాను. మీ వీలు చూసుకుని, త్వరలో మిమ్మల్ని పర్సనల్‌గా కలుసుకుంటాను..’’ అని తెలిపారు.

Updated Date - 2020-05-14T23:57:58+05:30 IST