ప్రభాస్ అందరికీ డార్లింగ్: సినీ ప్రముఖులు విషెస్

ABN , First Publish Date - 2020-10-23T17:38:14+05:30 IST

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వంతో అందరితోనూ కలిసిపోతుంటాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

ప్రభాస్ అందరికీ డార్లింగ్: సినీ ప్రముఖులు విషెస్

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వంతో అందరితోనూ కలిసిపోతుంటాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం `రాధేశ్యామ్` షూటింగ్ కోసం ఇటలీలో ఉన్న ప్రభాస్ అక్కడే తన 41వ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రభాస్‌కు విషెస్ తెలియజేశారు. 


ప్రభాస్ అన్నకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరమంతా నీకు గొప్పగా ఉండాలి                -వరుణ్ తేజ్


హ్యాపీ బర్త్‌డే బ్రదర్.. చేయబోయే ప్రతి పనిలోనూ నీకు మంచే జరగాలి    -రానా


హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అన్నా.. ప్రేమ, సంతోషం, సక్సెస్ నీ వెంటే ఉండాలని కోరుకుంటున్నా       -సాయితేజ్


ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మంచి మనిషి డార్లింగ్ ప్రభాస్‌కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీ భవిష్యత్తు ప్రాజెక్టులన్నింటికీ ఆల్ ది బెస్ట్     -నితిన్


హ్యాపీ బర్త్ డే ప్రభాస్. ఈ సంవత్సరమంతా నీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా. మీ స్టార్‌డమ్ మరింత పెరగాలి       -రకుల్


సూపర్ కూల్ డార్లింగ్ ప్రభాస్‌కు హ్యాపీ బర్త్ డే. రాధేశ్యామ్ కోసం ఎదురుచూస్తున్నా. ఎప్పటిలాగానే ఆ సినిమా కూడా అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నా       -డైరెక్టర్ బాబి


భారతీయ బాక్సాఫీస్‌ను అతను జయించాడు. ఇప్పుడు అతని ముందు ప్రపంచ బాక్సాఫీస్ ఉంది. రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్.. ఇలా ఏ పేర్లతో పిలిచినా ఆయన మాత్రం మనందరి హృదయాల్లో ఎప్పటికీ డార్లింగ్. ప్రభాస్‌కి అంతా మంచే జరగాలి        -మారుతి

Updated Date - 2020-10-23T17:38:14+05:30 IST

Read more