బాలయ్యకు సినీ ప్రముఖులు విషెస్!

ABN , First Publish Date - 2020-06-10T17:34:07+05:30 IST

నటరత్న నందమూరి బాలకృష్ణ నేటి (బుధవారం)తో 60వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.

బాలయ్యకు సినీ ప్రముఖులు విషెస్!

నటరత్న నందమూరి బాలకృష్ణ నేటి (బుధవారం)తో 60వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. బాలయ్య షష్టిపూర్తి సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సామాన్యులే కాకుండా పలువురు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు. 


నా సోదరుని కుమారుడు, నందమూరి బాలకృష్ణ 100 సంవత్సరాలు అష్ట ఐశ్వర్య  ఆయురారోగ్యములతో నిండు నూరేళ్ళు పుట్టిన రోజులు జరుపుకోవాలని నా హృదయపూర్వకముగా షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నాను   - మోహన్‌బాబు


మీరు ఎందరికో బాలయ్య.. నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ ఆదర్శంతోనే  సినిమాల్లోకి వచ్చాను. మీ స్ఫూర్తితోనే కొనసాగుతున్నాను. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను   - నందమూరి కల్యాణ్‌రామ్


మా బాలయ్యబాబుగారికి జన్మదిన శుభాకాంక్షలు   - సుధీర్ బాబు


బాలకృష్ణగారికి 60వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఇంతే ఉత్సాహంతో వెండితెరపై మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నా   - సాయిధరమ్ 

 

బాలయ్యబాబుకు జన్మదిన శుభాకాంక్షలు.. ఒళ్లు గగుర్పొడిచే పెర్ఫార్మెన్స్‌లతో అలరిస్తున్న బాలయ్యబాబుకు ధన్యవాదాలు   - హరీష్ శంకర్


60వ వసంతంలోకి అడుగుపెడుతున్న బాలయ్యబాబు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి ఘనమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ.. హ్యాపీ బర్త్‌డే బాలయ్య   - డైరెక్టర్ క్రిష్ 


వినయం, నమ్రత, ఆధ్యాత్మికత కలబోసిన అరుదైన వ్యక్తి మీరు. `ది లయన్`కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు   - నారా రోహిత్ 


సమరసింహారెడ్డి అనే సినిమా రావడం వల్లనే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక కొత్త కమర్షియల్ మలుపు తిరిగింది. వెయ్యి కోట్ల రెవెన్యూ, పదుల సంఖ్యలో పెద్ద దర్శకులు వచ్చారు. ఆ రోజుకి ఆ సినిమా కొత్త అనుభవం. ఆ డెసిషన్ తీసుకున్న  మన బాలయ్యబాబుకి షష్టిపూర్తి శుభాకాంక్షలు   - బీవీఎస్ రవి


బాల మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు.. కోకో కోలా పెప్సీ.. బాలయ్యబాబు సెక్సీ - పూరీ జగన్నాథ్ 

Updated Date - 2020-06-10T17:34:07+05:30 IST