2020: ఈ ప్రముఖులను కోల్పోయాం

ABN , First Publish Date - 2020-12-25T03:28:30+05:30 IST

2020 వినోదాల కంటే విషాదాలే ఎక్కువగా మిగిల్చింది. కారణం... కన్నీళ్లు, రోదన కలిగించిన.. కరోనానే! అయితే, సినీ ప్రముఖులు కూడా... మహమ్మారి

2020: ఈ ప్రముఖులను కోల్పోయాం

2020 వినోదాల కంటే విషాదాలే ఎక్కువగా మిగిల్చింది. కారణం... కన్నీళ్లు, రోదన కలిగించిన.. కరోనానే! అయితే, సినీ ప్రముఖులు కూడా... మహమ్మారి వల్ల కొందరు, ఇతర కారణాల వల్ల మరికొందరు... చాలా మందే ఈ సంవత్సరం మరణించారు. మనతో పాటూ కొత్త సంవత్సరంలో కాలుమోపలేకపోతోన్న... ఆ కీర్తి శేషుల్ని ఓసారి స్మరించుకుందాం. తెలుగు నాట ఆబాలగోపాలాన్ని విభ్రాంతికి గురి చేస్తూ నింగికేగాడు బాలు. గాన గంధర్వుడి నిష్క్రమణాన్ని ఇప్పటికీ సినీ, సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక 2020లోనే తెలుగు తెరని విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్లాడు జయప్రకాశ్ రెడ్డి. ఎన్నో పాత్రలు ఎంతో అద్భుతంగా పోషించిన ఆయన... నిజ జీవితంలోనూ తన క్యారెక్టర్‌ని కరోనా కాలంలో ముగించారు.


దేశంలోని అన్ని సినిమా రంగాల కంటే, ఈ యేడు, ఎక్కువ మంది ప్రముఖుల్ని కోల్పోయింది బాలీవుడ్. ఆఫ్ స్క్రీన్ సెలబ్రిటీల్లో... కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్, మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్, డైరెక్టర్ నిశికాంత్ కామత్ పేర్లు తప్పక చెప్పుకోవాలి. అలాగే ఆన్ స్క్రీన్ నటీనటుల్లో.... అభిమానుల గుండెల్ని కలచివేస్తూ ఆత్మహత్యలు చేసుకున్నారు ఆసిఫ్ బస్రా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఇక కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న వేళ మాయదారి క్యాన్సర్ పొట్టన పెట్టుకుంది... బాలీవుడ్ లెజెండ్రీ యాక్టర్ రిషీ కపూర్ ని, ఇమ్మెన్స్‌లీ టాలెంటెడ్ ఇర్పాన్ ఖాన్‌ని.


దేశంలోని ఇతర సినిమా రంగాలకి కూడా షాక్స్ తప్పలేదు 2020లో. కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జ ఈ సంవత్సరంలోనే హఠాన్మరణంతో అభిమానుల్ని శోక సంద్రం ముంచేశాడు. లెజెండ్రీ బెంగాల్ నటుడు సౌమిత్ర ఛటర్జీ కూడా కొన్నాళ్ల కిందట తుది శ్వాస విడిచారు. ఇక ఈ మధ్యే తమిళ నటి వీజే చిత్ర ఆత్మహత్య అందర్నీ విభ్రాంతికి గురి చేసింది.


కరోనా విజృంభణతో అమెరికా అల్లోకల్లోలం అయింది. చాలా మంది హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్ కూడా వైరస్ బారిన పడ్డారు. అయితే, ప్రపంచంలోని చాలా దేశాల్లో ఫ్యాన్స్ ఉన్న ఇద్దరు లెజెండ్రీ యాక్టర్స్ మాత్రం తమ మరణాలతో వార్తల్లో నిలిచారు. చాడ్ విక్ బోస్ మ్యాన్ చిన్న వయస్సులోనే క్యాన్సర్ తో  ప్రపంచాన్ని వీడిపోయాడు. ఇక జేమ్స్ బాండ్ పాత్ర ధారిగా ఎందరో అభిమానుల్ని స్వంతం చేసుకున్న సీన్ కానరీ కూడా 90 ఏళ్ల వయస్సులో, 2020లోనే మరణించారు.



Updated Date - 2020-12-25T03:28:30+05:30 IST