ఇలాంటి సినిమాలు చూస్తే ధైర్యం వస్తుంది: నాగశౌర్య
ABN , First Publish Date - 2020-03-04T03:55:44+05:30 IST
రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్

రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి 6న విడుదల కానుంది. విడుదలకు ముందే ఇండస్ట్రీలో కొత్తతరహా సినిమాగా ప్రశంసలు అందుకున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. యువ హీరోలు నాగశౌర్య, శ్రీ విష్ణు, దర్శకుడు మారుతి ప్రత్యేక అతిథులుగా హాజరై టీమ్‌ని అభినందించారు.
ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. ‘‘పలాస 1978 నేను చూసాను. చాలా ధైర్యంగా చెబుతున్నాను. ఆ కాలంలోకి తీసుకెళ్ళి కూర్చో బెట్టారు. దర్శకుడు కరుణ కుమార్‌గారు ఒక అద్భుతం చేశారు. పెద్ద షావుకారు పాత్ర చేసిన జనార్దన్‌గారికి నేను ఫిదా అయ్యాను. చిన్న షావుకారుగా రఘు కుంచెగారు చాలా బాగా చేసారు. టాలెంట్ చాలా చోట్ల ఉంటుంది. ‘పలాస 1978’ సినిమాతో దర్శకుడి టాలెంట్ అందరికీ తెలుస్తుంది. ఇలాంటి కథలు చేయాలని ఉన్నా లోపల చాలా భయం ఉంటుంది. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు చాలా ధైర్యం వస్తుంది. ఇలాంటి కథలు నిర్మించాలంటే నిర్మాతకు చాలా ధైర్యం ఉండాలి. కొడుకు హీరోగా ఉన్నా కూడా సినిమానే ప్రేమించి సినిమాను నిర్మించారు నిర్మాత ప్రసాద్‌గారు. నక్షత్ర చాలా బాగా నటించింది. రఘు చిన్నప్పటి నుంచి తెలుసు. అతని లైఫ్ స్టైయిల్ నాకు తెలుసు.. కానీ పూర్తి భిన్నమైన పాత్రలో ‘పలాస’ లో కనిపించి నన్ను సర్ ప్రైజ్ చేసాడు. అందరికీ ఆల్ ద బెస్ట్’’ అన్నారు.
హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ.. ‘‘‘మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. నేను రాజ్ దూత్‌తో ఇంట్రడ్యూస్ అయ్యాను. నా కెరియర్ స్టార్టింగ్‌లో ఇలాంటి రోల్ దొరకడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. చాలా చిన్న జర్నీగా స్టార్ట్ అయిన మా సినిమా సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ అవడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు కరుణ గారు కొత్త ప్రయత్నం చేస్తున్నారు అనుకున్నాం. కథ నచ్చి ఈ ప్రాజెక్ట్ చేయడానికి ముందుకు వచ్చాను. మా దర్శకుడు ప్రతి పాత్రను చాలా సహజంగా తీర్చిదిద్దారు. ఒక నటిగా లక్ష్మి పాత్ర నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది’’ అన్నారు.
దర్శకుడు కరుణ్ కుమార్ మాట్లాడతూ.. ‘‘పలాస నా మొదటి సినిమా చేద్దామనుకోలేదు. అయినా కొత్త తరహా కథలు కావాలని తమ్మారెడ్డి భరద్వాజ గారు నా నుండి ఈ కథను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు. నిర్మాత ప్రసాద్‌గారికి కృతజ్ఞతలు. నేను ఈ వేదికపై ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది నా జీవితంలో చాలా ఎమోషనల్ జర్నీ. ఈ సినిమా నమ్మిన ప్రసాద్‌గారికి, తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అన్నారు.
మ్యూజిక్ దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ.. ‘‘నా రచయితలు భాస్కరభట్ల రవికుమార్‌కి, లక్ష్మీ భూపాల్‌గారికి ధన్యవాదాలు. నా టీమ్‌కి ధన్యవాదాలు. నేను నటుడిని అవుతాను అనుకోలేదు. కానీ దర్శకుడు కరుణకుమార్‌గారు నన్ను కన్విన్స్ చేసారు. రెండు పాత్రలు చేయాలని కాస్త ఆలోచిస్తుంటే దర్శకుడు నాకు కావాల్సిన టైం ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. ఇన్ని షేడ్స్ ఉన్న పాత్ర నేను చేయడం నాకు ఛాలెంజ్‌గా అనిపించింది. అల్లు అరవింద్‌గారు, సుకుమార్‌గారు నా నటనను మెచ్చుకుంటుంటే చాలా సంతోషపడ్డాను. ఈ జర్నీలో నాకు తోడుగా నిలిచిన అందరికీ థ్యాంక్స్..’’ అన్నారు.
హీరో రక్షిత్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్. నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్. కరుణ్ కుమార్‌గారు స్టోరీ చెప్పే వరకు ఇలాంటి కథలు, మనుషులు నాకు తెలియదు. ఒక పద్దెనిమిది యేళ్ళ నుండి 60 యేళ్ళ వృద్దుడి వరకూ జర్నీ ఉంటుంది. ఈ సినిమాలోని డైలాగ్స్‌కి క్లాప్ప్ కొడతారు. రఘుకుంచెగారు మా నటనను బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మరో లెవల్‌కి తీసుకెళ్ళారు. ఇలాంటి తండ్రి దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా అందరికీ మంచి ఎక్స్‌పీరియన్స్‌గా మిగులుతుంది’’ అన్నారు.
Read more