కోజికోడ్ విమాన ప్రమాదంపై సినీ ప్రముఖుల స్పందన!
ABN , First Publish Date - 2020-08-08T16:16:54+05:30 IST
దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కోజికోడ్ విమానాశ్రయం రన్‌వేపై ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కోజికోడ్ విమానాశ్రయం రన్‌వేపై ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 19కి చేరింది. గాయపడిన 171 మంది వేర్వేరు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ విమాన ప్రమాదంపై సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మరణించిన వారికి నివాళులర్పించారు.
విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన విమానాశ్రయ సిబ్బందికి, స్థానిక ప్రజలకు సలామ్. ఇప్పటికే ఎంతో శ్రమిస్తున్న కేరళ వైద్యులకు మరింత బలం చేకూరాలి -కమల్ హాసన్
కోజికోడ్ విమానాశ్రయంలో జరిగిన ప్రమాదం దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా -మహేష్ బాబు
కేరళలో జరిగిన విమాన ప్రమాదం అత్యంత బాధాకరం. ఈ వార్త విని షాక్‌కు గురయ్యా. ఈ ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. మృతుల కుటుంబాలకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా -అల్లు అర్జున్
నిద్ర లేచిన వెంటనే కేరళలో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలుసుకుని షాకయ్యా. మృతుల కుటుంబాలకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా -మంచు విష్ణు
Read more