అందరి జీవితాల్లోనూ వెలుగులు నిండాలి: సినీ ప్రముఖుల విషెస్
ABN , First Publish Date - 2020-11-14T19:03:10+05:30 IST
చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయాలకు ప్రతీకగా దీపావళి పండగను జరుపుకుంటారు.

చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయాలకు ప్రతీకగా దీపావళి పండగను జరుపుకుంటారు. హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రముఖమైన ఈ పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండి కుటుంబంతో కలిసి వేడుక నిర్వహించుకోవాలని సూచించారు.
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి వెలుగులు మీ జీవితంలోని చీకటిని తొలగించి విజయాలను ప్రసాదించాలని కోరుకుంటున్నా -నాగార్జున
మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీకిష్టమైన వారికి దీపావళి శుభాకాంక్షలు -వెంకటేష్
అందరికీ దీపావళి శుభాకాంక్షలు. వెలుగు ఇచ్చే ప్రేమ, ఆశ, సంతోషాన్ని అందరికీ పంచుదాం. అలాగే కాలుష్యం నుంచి మనల్ని, మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని గుర్తుంచుకోండి -మహేష్
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు -ఎన్టీయార్
దీపావళి శుభాకాంక్షలు. టపాసులు కాల్చకండి. స్వీట్స్ బాగా తినండి. కుటుంబంతో కలిసి దీపావళి జరుపుకోండి. ఎంజాయ్ చెయ్యండి. సురక్షితంగా, సంతోషంగా ఉండండి. సురక్షితమైన, ఉత్తమ భవిష్యత్తును దేవుడు అందిస్తాడు -రష్మికా మందన్న
అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సురక్షితంగా, సంతోషంగా ఉండండి -నాగచైతన్య
అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వెలుగు మనల్ని సరికొత్త భవిష్యత్తులోకి తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. ఆర్థిక, భావోద్వేగ కారణల వల్ల ప్రతి ఒక్కరు ఈ పండగను జరుపుకోలేరు. కాబట్టి మీ ప్రార్థనలో వారిని తలుచుకోండి -శ్రుతి
అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆశావహ దృక్పథం, ప్రేమ, వెలుగుతో మీ జీవితం నిండిపోవాలని కోరుకుంటున్నా -సొనాక్షి
Read more